![]() |
![]() |
.webp)
సరిగమప లిటిల్ చాంప్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ జోష్ గా ఫన్నీగా ఉంది. ఇక రెట్రో స్పెషల్ తో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రాబోతోంది. రెట్రో థీమ్ ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటుంది. ఓల్డ్ సాంగ్స్ కి కొత్త కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో చిన్నారి కంటెస్టెంట్స్ అలరించారు. వర్షిణి స్టేజి మీదకు వచ్చి "నేను ఒకరిని ప్రేమించాను" అని చెప్పింది. వెంటనే సుధీర్ వచ్చి "ఎవరతను" అనేసరికి "గోపి"అని చెప్పింది. "ప్రతీ బ్లాక్ అండ్ వైట్ ఫిలింలో అదే రాధ అదే గోపి" అంటూ డైలాగ్ వేసాడు అనిల్ రావిపూడి. ఇక జడ్జెస్ కూడా ఓల్డ్ రెట్రో స్టైల్ గెటప్స్ తో అలరించారు. ,అనంత శ్రీరామ్ కూడా వచ్చి "రాధ రాధ రాధ" అనేసరికి "ఆవిడే పేరు రాధ అనే పెట్టుకుంది" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో కామెడీగా కామెంట్ చేశారు అనిల్. ఇంతలో రోజా ఎంట్రీ ఇచ్చింది.
ఆమె వస్తుంటే "ఒక లైలా కోసం" అనే సాంగ్ ప్లే అయ్యింది. "అవును మేము 80s చేస్తున్నాం మీకు ఓకేనా" అని సుధీర్ అడిగాడు. "2000 లో పుట్టాను కదా కొంచెం కష్టమే" అని చెప్పింది. "ఎన్ని షోలు మారినా ఆవిడ ఏజ్ మారదా..నాన్సెన్స్ " అంటూ అనిల్ రావిపూడి సీనియర్ నటుడు నాగేశ్వరావు గారిలా కంఠం మార్చి అడిగాడు. ఇక పిల్లలు వచ్చి "బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది" అంటూ పాడేసరికి "మమ్మల్ని 70s కి తీసుకెళ్లిపోయారు" అంటూ చెప్పాడు. తర్వాత "చెంగావి రంగు చీర" అని సాంగ్ పాడేసరికి ఆడియన్స్ లో ఇద్దరు లేచి ఆ సాంగ్ సిగ్నేచర్ స్టెప్స్ వేశారు. దాంతో అనంత శ్రీరామ్ "వాళ్లకు వాళ్ళ యవ్వనం గుర్తొచ్చింది" అంటూ చెప్పాడు. తర్వాత "గోలీమార్ మార్" అనే పాట పాడారు. "ఆ రెట్రోలో ఉన్న ఎక్స్ప్రెషన్ మీ కంఠంలో కనిపించింది" అంటూ ఇద్దరు చిన్నారులకు అనంత శ్రీరామ్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఇక ఇదే సాంగ్ కి అనిల్, సుధీర్ అందరూ కలిసి స్టెప్పులేశారు. రెట్రో 2 . 0 అని ప్రోగ్రాం టైటిల్ ని సుధీర్ చెప్పేసరికి జడ్జి శైలజ తన రెగ్యులర్ కళ్లజోడును తీసేసి కలర్ ఫుల్ కళ్ళజోడు పెట్టి ఒక లుక్ ఇచ్చారు.
![]() |
![]() |